బాధ్యతకు, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.. ఖమ్మం జిల్లా కలెక్టర్ సేవలు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

*బేతుపల్లి వరదల నేపథ్యంలో ప్రజల భద్రతే ధ్యేయంగా క్షేత్రస్థాయి సేవలలో నిలిచిన కీర్తి ____కలెక్టర్ దివాకర్ టీ.ఎస్*

*బాధ్యతకు, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.. జిల్లా కలెక్టర్ సేవలకు

TWJF జిల్లాఅధ్యక్ష కార్యదర్శులు నానబాల రామకృష్ణ అర్వపల్లి నగేష్ లు ఘన సత్కారం

ఖమ్మం: అధికారం అంటే హోదా కాదు.. ప్రజల కష్టాల్లో అండగా నిలిచే బాధ్యత. ఆ బాధ్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీ.ఎస్.ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్

మామిడి సోమయ్య యూనియన్ (TWJF) ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు నానబాల రామకృష్ణ అర్వపల్లి నగేష్ మరియు వారి యూనియన్ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేతుపల్లి చెరువు ఘటన నేపథ్యంలో కలెక్టర్ దివాకర్ టీ.ఎస్. స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించి, గత రెండు రోజులుగా విశ్రాంతి లేకుండా భద్రతా చర్యలను పర్యవేక్షిస్తూ, సంబంధిత అధికారులను సమన్వయం చేస్తూ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. మరోసారి ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు.

“విపత్కర పరిస్థితుల్లో అధికారి స్పందించే వేగమే ప్రజలకు కొండంత భరోసా. బాధ్యతను విధిగా కాకుండా మానవత్వంతో నిర్వర్తించినప్పుడే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోగలరు” అంటూ జర్నలిస్టులు కలెక్టర్ సేవలను ప్రశంసించారు.

ఈ సందర్భంగా TWJF జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. “అధికారి అంటే ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు జారీ చేయడం మాత్రమే కాదు.. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వారి మధ్యకు వెళ్లి, వారి కన్నీళ్లకు భరోసా ఇవ్వడం. ప్రజల ప్రాణాలే పరమావధిగా భావించి క్షేత్రస్థాయిలో పనిచేసిన కలెక్టర్ దివాకర్ టీ.ఎస్. నిజమైన ప్రజాసేవకుడిగా నిలిచారు” అని కొనియాడారు.

“పదవులు హోదాను ఇస్తాయి.. కానీ ప్రజల కోసం చేసే సేవే గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చూపిన చొరవ, బాధ్యతాయుతమైన పర్యవేక్షణ ఎప్పటికీ అభినందనీయం” అని పేర్కొన్నారు.

సన్మానానికి స్పందించిన జిల్లా కలెక్టర్ దివాకర్ టీ.ఎస్. TWJF జిల్లా కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని, బేతుపల్లి ఘటనను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతామని తెలిపారు.

“ప్రజల ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదు.. ప్రజల భద్రత కోసం ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలి” అనే సందేశాన్ని కలెక్టర్ తన కార్యాచరణ ద్వారా చాటిచెప్పారని TWJF ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

ప్రజా సమస్యలపై స్పందించే అధికారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తారని, బేతుపల్లి ఘటనలో కలెక్టర్ మరియు అదనపు జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ,మరియు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి (DPRO )గౌస్ పాషా చూపిన చొరవ ప్రజల్లో అధికార యంత్రాంగంపై నమ్మకాన్ని మరింత పెంచుతుందని జర్నలిస్టులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో TWJF జిల్లా అధ్యక్షులు నానబాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అర్వపల్లి నగేష్, నేషనల్ కౌన్సిల్ మెంబర్స్ ఎలుగోటి వెంకట్, కప్పల మధు, స్టేట్ కౌన్సిల్ మెంబెర్స్ బంక మన్మధరావు, మామిడాల వీరబాబు, జిల్లా ఉపాధ్యక్షులు లింగాల రామ్మూర్తి,చిన్నంశెట్టి రాంబాబు, పామర్తి నాగె శ్వరావు, మల్లెబోయిన, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులు

భారత్ సమ్మిట్–2026లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు Rahul Gandhi కి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన...

తెలంగాణలో సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వమే ప్రభుత్వ అభివృద్ధి విధానం* *భారత్ సమ్మిట్ – 2026 అంతర్జాతీయ ప్యానెల్ చర్చలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్*

*హైదరాబాద్, నవంబర్ 13:* విద్య, సంక్షేమం, సాధికారత ద్వారానే సమాజంలో నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, దివ్యాంగులు, వయోవృద్ధులు,...

వయోజన విద్యాశాఖ జిల్లా ఇన్‌చార్జిగా ఏ. పురుషోత్తం బాధ్యతల స్వీకరణ

పోరు తెలంగాణ మంచిర్యాల జిల్లా,నవంబర్ 12, 2026: మంచిర్యాల జిల్లా వయోజన విద్యాశాఖ జిల్లా ఇన్‌చార్జిగా నూతనంగా నియమితులైన ఏ. పురుషోత్తం గురువారం బాధ్యతలు...

రెండేళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

Nov 13, 2026, రెండేళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం దేశంలో ఆహార ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి చేరింది. ఆర్బీఐ...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.