కొండపల్లిలో 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.ఒకరిపై కేసు నమోదు. 5 లీటర్ల గుడుంబా స్వాధీనం.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పోరు తెలంగాణ అక్టోబర్: 28: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాల నియంత్రణలో భాగంగా పోలీసులు నిర్వహించిన కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ కార్యక్రమంలో 1000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పెంచికల్‌పేట్‌ మండలం కొండపల్లి గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.ఎస్సై అనిల్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.గ్రామంలో నిర్వహించిన కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ కార్యక్రమంలో భాగంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన 1000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడంతోపాటు, 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్‌ కుమార్‌ తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠినమైన చర్యలు తప్పవని తెలిపారు.ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

పీఎం జన్మన్ ఇళ్ల సమావేశాన్ని విజయవంతం చేయాలి.కోలాం తెగకు చెందిన ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలి.

పోరు తెలంగాణ నవంబర్ 16: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.   ఆసిఫాబాద్: పీఎం జన్మన్ పథకం కింద ఇళ్ల మంజూరు, సంబంధిత సమస్యలపై చర్చించేందుకు మంగళవారం...

పీఎం జన్మన్ ఇళ్ల సమావేశాన్ని విజయవంతం చేయాలి.కోలాం తోటి ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలి.

  పోరు తెలంగాణ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 16: ఆసిఫాబాద్: పీఎం జన్మన్ పథకం కింద ఇళ్ల మంజూరు, సంబంధిత సమస్యలపై చర్చించేందుకు మంగళవారం...

సాంకేతికతలో ప్రపంచానికి దిక్సూచిగా భారత్ ఎదగాలి: రాజ్‌నాథ్ సింగ్

Nov 16, 2026, సాంకేతికతలో ప్రపంచానికి దిక్సూచిగా భారత్ ఎదగాలి: రాజ్‌నాథ్ సింగ్ 15వ అంతర్జాతీయ ఎరో ఎన్‌డీటీ 2026 సింపోజియంలను కేంద్ర రక్షణ మంత్రి...

టీజీపీఎస్సీ ద్వారా 102 స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

Nov 16, 2026, టీజీపీఎస్సీ ద్వారా 102 స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ TGPSC రాష్ట్ర ఆర్థిక, గణాంకాల శాఖలో 102 మండల ప్లానింగ్ అండ్...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.