పోరు తెలంగాణ అక్టోబర్ 28: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. పోలీస్ ఫ్లాగ్ డే (అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు) పురస్కరించుకొని ఈజ్ గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త సర్సాల గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈజ్ గాం ఎస్సై బి. నరేష్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజల రక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈజ్ గాం పోలీస్ సిబ్బంది, కొత్త సర్సాల గ్రామస్తులు మరియు స్థానికులు పాల్గొన్నారు.
గ్రామాల్లో ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కరిస్తాం: ఈజ్ గాం పోలీసులు. కొత్త సార్సాల ల:
Date:
Share post:

