పోరు తెలంగాణ అక్టోబర్: 28: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాల నియంత్రణలో భాగంగా పోలీసులు నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో 1000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.ఎస్సై అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.గ్రామంలో నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో భాగంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన 1000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడంతోపాటు, 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠినమైన చర్యలు తప్పవని తెలిపారు.ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
కొండపల్లిలో 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.ఒకరిపై కేసు నమోదు. 5 లీటర్ల గుడుంబా స్వాధీనం.
Date:
Share post:

