సంగారెడ్డిలో ఏసీబీ వలకు చిక్కిన వ్యవసాయ అధికారి.. రూ.20 వేల లంచం తీసుకుంటూ అరెస్ట్

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ అధికారి జి. రమేష్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎరువుల వ్యాపారం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు ఫిర్యాదుదారుడి అల్లుడి నుంచి మొత్తం రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.

ఇప్పటికే అక్టోబర్ 19న రూ.10 వేలు తీసుకున్న అధికారి, మిగిలిన రూ.20 వేలు నవంబర్ 3న తన కార్యాలయంలో తీసుకుంటుండగా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

 

*లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయండి:* ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ *1064* కు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు సూచించారు.

spot_img
spot_img

Related articles

ఏసీబీ సంచలనం! రూ 2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సర్పంచ్! డిమాండ్ చేసింది రూ 30 లక్షలు!

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం మోదుగడ్డ తండా గ్రామ సర్పంచ్ ధరావత్ వీరు అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో చిక్కారు! ఖమ్మంలో...

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇకపై అలాంటి పోస్టులకు చెక్‌.. మెటా కీలక నిర్ణయం!*

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా కీలక అప్డేట్ తీసుకొచ్చింది. అశ్లీలత, హింసాత్మక, రెచ్చగొట్టే స్వభావం ఉన్న కంటెంట్‌ను నియంత్రించేందుకు రికమెండేషన్ అల్గారిథమ్‌లో మార్పులు చేసింది. ఇకపై యూజర్లు...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.