రాష్ట్రంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పురపాలక శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా, పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా పట్టణాలను అభివృద్ధి చేసే ప్రణాళికలపై చర్చించిన ముఖ్యమంత్రి

Date:

Share post:

📰 Generate e-Paper Clip

హైదరాబాద్
ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB), ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు (AIIB), జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ (KFW) బ్యాంకుతో పాటు దేశీయ ఆర్థిక సంస్థల సహకారంతో దాదాపు రూ. 20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టేందుకు పురపాలక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

వరంగల్‌ నగర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి పారుదల వ్యవస్థ, వరంగల్ కోట చుట్టూ ఉన్న కందకం పునరుద్ధరణ, హనుమకొండలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు.

రాష్ట్రంలో మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు. శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు, ప్రధానంగా టెక్స్‌టైల్ పార్కులకు వినియోగించడం ద్వారా మంచినీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు అవకాశముంది.

పట్టణాల్లో తాగునీటి సరఫరా, నీటి శుద్ధి, పంపిణీ వ్యవస్థల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించడంపై ముఖ్యమంత్రి గారు అధికారులకు పలు సూచనలు చేశారు.

వరంగల్ మెగా సిటీ ఎకనామిక్ రీజియన్ పరిధిలో వ్యర్థాల నుంచి 10 నుంచి 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను సమీక్షించారు. బయో సీఎన్‌జీ ఉత్పత్తి, ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుపై చర్చించారు.

✅ ఈ ప్రాజెక్టుల ద్వారా పట్టణాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడం, నీటి వనరులను సంరక్షించడం, వరద ముప్పును నివారించడం, పురపాలక సంస్థల నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం లక్ష్యంగా నిర్దేశించారు.

spot_img
spot_img

Related articles

*అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పింఛన్లు..* *సదరం సర్టిఫికెట్ల జారీలో అధికారు లు ప్రత్యేక చొరవ చూపాలి..* *రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..* *మెట్ పల్లి లో...

/మెట్ పల్లి టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ...

ఆధారిత వ్యాపారాలకు అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్ * ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా 1M1B సంస్థ నిర్వహించిన గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఈరోజు ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో ఐటీ, లైఫ్...

సిద్దిపేట జిల్లాలో రూ. 544.11 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో రూ. 544.11 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మాజీ ప్రధానమంత్రి...

ఏసీబీ సంచలనం! రూ 2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సర్పంచ్! డిమాండ్ చేసింది రూ 30 లక్షలు!

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం మోదుగడ్డ తండా గ్రామ సర్పంచ్ ధరావత్ వీరు అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో చిక్కారు! ఖమ్మంలో...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.