ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి..
మహేశ్వరం, సెప్టెంబర్ 11, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి:
మహేశ్వరం మండలంలోమంజూరైన రోడ్లను వెంటనే ప్రారంభించాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం బిజెపి మండల అధ్యక్షుడు టి. యాదీష్ ఆధ్వర్యంలో మహేశ్వరం మండలంలో రోడ్ల పరిస్థితులపై నిర్వహించిన మహా పాదయాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూల్ల వీరేందర్ గౌడ్, నియోజకవర్గం బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మండలంలో ఉన్న అధ్వాన్న రోడ్లతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామాలలో హం ప్రాజెక్టు కింద 12 రోడ్లు మంజూరు అయినప్పటికీ ఇంతవరకు పనులను ప్రారంభించలేదని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి భారతీయ జనతా పార్టీ పాదయాత్ర నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. అధికారులు వెంటనే స్పందించి మంజూరైన రోడ్ల పనులను ప్రారంభించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి బొక్క నరసింహారెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా నాయకులు పాపయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ కో- కన్వీనర్ అనంతయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు కడారి జంగయ్య యాదవ్, సుదర్శన్ రెడ్డి, దేశ్యా నాయక్, కుండే వెంకటేష్, పాండు నాయక్, పంతు నాయక్, పోతర్ల సుదర్శన్ యాదవ్, మాధవాచారి, యాదయ్య గౌడ్, హనుమంతు నాయక్, కాసాని వెంకటేష్ గౌడ్, శ్రావణ్, ఉపేందర్, మోతే యాదయ్య, యాదగిరి వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, బిజెపి పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

