నల్గొండ జిల్లా TUWJ–IJU ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం రిలే నిరాహార దీక్షలు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం రిలే నిరాహార దీక్షలు

రిలే దీక్షలకు MLC నెల్లికంటి సత్యం, వివిధ పార్టీల నాయకుల సంఘీభావం

నల్లగొండ: జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలనే డిమాండ్‌తో TUWJ–IJU నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పులి మామిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దీక్షలు నిర్వహిస్తున్నారు.

రిలే నిరాహార దీక్షలకు యూనియన్ నాయకులు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరై జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ఈ సందర్భంగా TUWJ–IJU నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించాలని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో TUWJ–IJU వీడియో జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు, యూనియన్ నాయకులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు...

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా...

జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షునిగా కాసిపేట సతీష్ కుమార్

కాంగ్రెస్గ్  పార్టీ జైపూర్ మండల సెల్ అధ్యక్షునిగా జైపూర్ మండలం నర్సింగాపూర్ (ఎస్) గ్రామానికి చెందిన కాసిపేట సతీష్ ఎన్నికయ్యారు, ఈ సందర్భంగా కాసిపేట...

అటవీ ప్రాంతంలో అరుదైన నీలి రంగు పుట్టగొడుగు.

సిర్పూర్ (టీ) అక్టోబర్ 01: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌(టి) అటవీ డివిజన్‌ పరిధిలోని మాకిడి నెక్షన్‌, గొల్యాల్‌ అటవీ ప్రాంతంలో అరుదైన నీలిరంగు పుట్టగొడుగు...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.