పోలీసు సిబ్బందికి స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన సీపీ అంబర్ కిషోర్ ఝా

Date:

Share post:

📰 Generate e-Paper Clip

మంచిర్యాల// రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద శుక్రవారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీపీ స్వయంగా భక్తులకు, పోలీసు సిబ్బందికి అన్నప్రసాదాన్ని వడ్డించారు.పోలీసు సిబ్బందితో కలిసి భోజనం చేసి, వారితో ఆత్మీయంగా మమేకమయ్యారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయం, అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని సూచించారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.
ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని, విధుల నిర్వహణలో పరస్పర సహకారం, సమన్వయానికి ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు సిబ్బందికి సూచించారు. వృత్తిపరమైన నైపుణ్యంతో పాటు సేవాభావంతో విధులు నిర్వర్తిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సీపీ ఆకాంక్షించారు.

spot_img
spot_img

Related articles

లక్షెట్టిపేట లో ఆవోప ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

పోరు తెలంగాణ లక్షెట్టిపేట అక్టోబర్ 2. లక్షెట్టిపేట పట్టణంలో ఆవోప ఆధ్వర్యంలో గాంధీ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి...

లక్షెట్టిపేట లో అవోప ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

లక్షెట్టిపేట పట్టణంలో ఆవోప ఆధ్వర్యంలో గాంధీ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు....

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఒప్పందం చేసుకున్న జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు హరేకృష్ణ...

హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నీ జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్...

పోలీసు అధికారులు, సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 క్లస్టర్

హైదరాబాద్// పోలీసు అధికారులు, సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.