ఆసిఫాబాద్ జిల్లాలో మున్నూరు కాపు సంఘం పటేల్స్ వెబ్సైట్ ఆవిష్కరణ

Date:

Share post:

📰 Generate e-Paper Clip

తెలంగాణ రాష్ట్రంలోని మున్నూరుకాపులను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఐక్యతను పెంపొందించేందుకు కుటుంబ సభ్యత్వం నమోదు ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ మున్నూరుకాపు సంఘం పటేల్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్యపటేల్ తెలిపారు. శుక్రవారం కాగజ్‌నగర్‌ పట్టణంలోనీ పటేల్ గార్డెన్‌తో పాటు ఆసిఫాబాద్ పట్టణంలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గజ్జల లక్ష్మణ్‌తో కలిసి వెబ్‌సైట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నూతన పదవులు పొందిన ఆసిఫాబాద్ జిల్లా యూత్ అధ్యక్షులు గాజుల ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పూదారి సాయి (గోలేటి), కాగజ్‌నగర్ మండల అధ్యక్షుడు మేడిపల్లి రవి, వైస్ ప్రెసిడెంట్ పేరుక మహేష్, కాగజ్ నగర్ మండల యూత్ అధ్యక్షుడు పార్వతి సురేష్, ఉపాధ్యక్షుడు డెక్కపురి గోపాల్, పట్టణ అధ్యక్షుడు చిట్టంపల్లి అనిల్, ప్రధాన కార్యదర్శి పూదారి సాయి, కోశాధికారి పుల్లిశెట్టి వెంకటేష్‌లకు పదవులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమ శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అనిశెట్టి సదాశివ్, సిర్పూర్ తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లి తిరుపతి, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

జగిత్యాలలో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం వెలుగులోకి“ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసం చేసినట్లు ఫిర్యాదు

జగిత్యాల// అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులు సేకరించిన కేసులో ఓ వ్యక్తిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. “ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు...

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు...

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.