వినాయక నిమజ్జన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీపీ సమన్వయ సమావేశం

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి//వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పోలీస్,సింగరేణి, మున్సిపల్, రెవెన్యూ,విద్యుత్, వైద్య ఆరోగ్య, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక,ఫిషరీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు,భద్రతా చర్యలు,ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపై సీపీ అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా సీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ, వినాయక నిమజ్జన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగే నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.గత సంవత్సరం నిమజ్జనం సందర్భంగా ఎదురైన సమస్యలు, ఇబ్బందులు, లోపాలను సమీక్షించి,అవే సమస్యలు ఈ సంవత్సరం పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నిమజ్జన ప్రదేశాలు, శోభాయాత్ర మార్గాలు,రద్దీ ప్రాంతాలు,పార్కింగ్ ప్రదేశాలను ముందుగానే పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఫిషరీస్,సంబంధిత శాఖల అధికారులు నిమజ్జన ప్రదేశాల్లో నీటి లోతు, ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రమాదాల నివారణకు రక్షణ సిబ్బంది,శిక్షణ పొందిన ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, అవసరమైన రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
మున్సిపల్ అధికారులు నిమజ్జన ప్రదేశాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు,లైటింగ్, రోడ్ల పరిస్థితి, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు నిమజ్జన మార్గాలు, మండపాలు, నిమజ్జన ప్రదేశాల్లో విద్యుత్ వైర్లు, స్తంభాలు, తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లను ముందుగానే పరిశీలించి,ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అగ్నిమాపక శాఖ అధికారులు అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఫైర్ టెండర్లు,సిబ్బంది, రక్షణ పరికరాలను కీలక ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలని తెలిపారు.సింగరేణి అధికారులు తమ పరిధిలోని నిమజ్జన మార్గాలు, రహదారులు, సంబంధిత ప్రాంతాల్లో అవసరమైన సహకారం అందించాలని, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
పోలీస్ అధికారులు నిమజ్జన శోభాయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ,రద్దీ నిర్వహణ, బందోబస్తు, పార్కింగ్,క్రేన్‌లు, ఇతర అత్యవసర సేవల సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీపీ ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్,ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సీఐ కృష్ణకుమార్, గోదావరిఖని 2 టౌన్ సీఐ ప్రసాద్ రావు, జైపూర్ సీఐ నవీన్ కుమార్,ఎస్‌ఐ భూమేష్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

లక్షెట్టిపేట లో ఆవోప ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

పోరు తెలంగాణ లక్షెట్టిపేట అక్టోబర్ 2. లక్షెట్టిపేట పట్టణంలో ఆవోప ఆధ్వర్యంలో గాంధీ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి...

లక్షెట్టిపేట లో అవోప ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

లక్షెట్టిపేట పట్టణంలో ఆవోప ఆధ్వర్యంలో గాంధీ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు....

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఒప్పందం చేసుకున్న జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు హరేకృష్ణ...

హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నీ జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్...

పోలీసు అధికారులు, సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 క్లస్టర్

హైదరాబాద్// పోలీసు అధికారులు, సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.