అశ్వాపురం ఎస్సీ కాలనీలో విజృంభిస్తున్న విషజ్వరాలు.వెంటనే హెల్త్ క్యాంపు నిర్వహించాలి

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రత్యేక హెల్త్ క్యాంప్‌ నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షుడు గద్దల రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.

కాలనీలోని పలు కుటుంబాల్లో జ్వరం, జలుబు, గొంతునొప్పి వంటి అనారోగ్య సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులతో పాటు మెడికల్‌ దుకాణాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. సీజనల్‌ వ్యాధులు మరింత విస్తరించకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
“ప్రజలు అనారోగ్యంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకముందే అధికారులు కాలనీలోకి వచ్చి వైద్య సేవలు అందించాలి. ప్రతి ఇంటిని సందర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, అవసరమైన వారికి అక్కడికక్కడే మందులు అందించాలి” అని రామకృష్ణ కోరారు.
పంచాయతీ, వైద్యారోగ్యశాఖ సిబ్బంది సమన్వయంతో ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించి, జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించాలని సూచించారు. అలాగే కాలనీలో పారిశుధ్య లోపాలు, నిల్వ నీరు, దోమల సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరారు.
“జ్వరాలు ముదిరిన తర్వాత స్పందించడం కంటే.. వ్యాధులు వ్యాప్తి చెందకముందే నివారణ చర్యలు చేపట్టడం ముఖ్యం. ఎస్సీ కాలనీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణమే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలి” అని గద్దల రామకృష్ణ కోరారు.

spot_img
spot_img

Related articles

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

జగిత్యాలలో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం వెలుగులోకి“ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసం చేసినట్లు ఫిర్యాదు

జగిత్యాల// అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులు సేకరించిన కేసులో ఓ వ్యక్తిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. “ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు...

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు...

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.