బూర్గంపాడు పోరు తెలంగాణ జిల్లా ప్రతినిధి కూరపాటి దాసు
కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖ పారిశ్రామిక వేత పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి కుటుంబంలో ఇటీవల జరిగిన వివాహ వేడుక సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించేందుకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం లక్ష్మీపురం గ్రామంలోని పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి నివాసానికి ప్రత్యేకంగా విచ్చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన దంపతులను ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు , ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పోతిరెడ్డివెంకటేశ్వరరెడ్డి జిల్లా కలెక్టర్ అంకిత్ ఐటీడీఏ పీవో భద్రాచలం సబ్ కలెక్టర్ జిల్లా డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న,* మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాకతో పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి నివాసంలో సందడి నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఇల్లు కళకళలాడింది. మంత్రి నూతన దంపతులను స్వయంగా ఆశీర్వదించడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

