కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. పోరు తెలంగాణ అక్టోబర్
04:
భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అశోక్ మహుల్కార్.
కొమరం భీం ఆసిఫాబాద్ అక్టోబర్ 4: కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో లుంబిని దీక్ష భూమిలో ఈ నేల 29 న నిర్వహించనున్న 70వ దమ్మ చక్ర పరివర్తన్ దివస్ కార్యక్రమాన్ని జిల్లాలోని బౌద్ధ బాంధవులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అశోక్ మహల్కార్ ఆదివారం లుంబిని దీక్ష భూమి కేంద్రంగా నిర్వహించిన కేంద్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబాసాహెబ్ డా. బి ఆర్ అంబేద్కర్ గారు స్థాపించిన సమతా సైనిక్ దళ్ ఈ సంఘం లో ప్రతి ఒక్క్కరు చేరాలి ట్రైనింగ్ తీసుకోవాలి. సమతా సైనిక్ దళ్ సైనికులకు ప్రతినిత్యం ఇవ్వాలి, జిల్లా లోని అన్ని గ్రామా ప్రజలు ఈ కార్యక్రమం లో పాల్గొనాలి, బాబాసాహెబ్ సంకల్పించిన పే బ్యాక్ టూ సోసైటీ తో తన్, మన్, ధన్ తో ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రశాంత్,నాయకులు పెరుగు ఆత్మారాం, చల్లూరి వామన్, దుర్గ అనిల్, చాపిడి సురేష్, మహిళ నాయకులు ,యువకులు,కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా దీక్ష భూమి, సెంటర్ కమిటీ సభ్యులు, ఎస్సి సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు,ఎస్సీ కులాల ప్రతినిధులు, జిల్లా నాయకులు, యువ, మహిళా నాయకులు పాల్గొన్నారు.

