నాగుల వాయి గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన బెజ్జూర్ ఎస్ ఐ కె .రమేష్.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పోరు తెలంగాణ అక్టోబర్ 13: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.  బెజ్జూర్ మండలంలోని నాగులవాయి గ్రామంలో ఈరోజు బెజ్జూర్ ఎస్ఐ కే. రమేష్ గారు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల రేచిని గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ నికూరి అనంతరావు మరియు ఆయన చిన్నాన్న నికూరి రాజయ్య సలుగుపల్లి శివారులో రోడ్డు మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తుచేస్తూ, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాహనాలను అతివేగంగా నడపకుండా నెమ్మదిగా, అప్రమత్తంగా నడపాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మోటార్ సైకిల్‌పై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని తెలిపారు. రోడ్డు మలుపుల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలని ఎస్ఐ కే. రమేష్ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.

spot_img
spot_img

Related articles

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.