రైతులతో కలెక్టర్ ముఖాముఖి.పెరటి కోళ్ల పెంపకం, వర్మీ కంపోస్ట్ తయారీతో రైతులకు అదనపు ఆదాయం.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

  • రైతులతో కలెక్టర్ ముఖాముఖి.పెరటి కోళ్ల పెంపకం, వర్మీ కంపోస్ట్ తయారీతో రైతులకు అదనపు ఆదాయం.

పోరు తెలంగాణ అక్టోబర్ 14: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న కాలానుకూల వ్యవసాయ ఆధారిత జీవనోపాధుల కార్యక్రమం లో భాగంగా జిల్లా కలెక్టర్ కె హరిత రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరటి కోళ్ల పెంపకంపై శిక్షణ పొందిన రైతులతో, వర్మీ కంపోస్ట్ తయారీలో విజయవంతంగా ముందుకు సాగుతున్న రైతులతో మాట్లాడి వారి అనుభవాలు, ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకున్నారు. రైతులు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను అవలంబించి, అదనపు ఆదాయం పొందేలా ప్రోత్సహించారు. అలాగే అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం రైతుల జీవన ప్రమాణాల మెరుగుదల, స్థిరమైన వ్యవసాయం, గ్రామీణ జీవనోపాధుల బలోపేతానికి దోహదపడుతుంది. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ జిల్లా సమన్వయ కర్త డా. బాలరాజు రాజారాం,వి సి ఎప్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రతాప్, కౌశిక్, అడ్మిన్ వినయ్, ఎస్ టు పోషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సాయి లిఖిత, రైతులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...

భీమారంలో బాల్క సుమన్ జన్మదిన వేడుకలు

భీమారం మండల కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, మాజీ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాల్కా సుమన్ ...

సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమం.

జిల్లా అధ్యక్షులు వంగరి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహణ... పోరు తెలంగాణ అక్టోబర్ 17: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...

వరంగల్ లో సంచలన తీర్పు: భర్త హత్య కేసులో భార్యతో సహా 10 మందికి జీవిత ఖైదు

  వరంగల్,* తెలంగాణలో వైవాహిక వివాదాల నేపథ్యంలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి వరంగల్ జిల్లా కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. రంగంపేటకు చెందిన దత్తు...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.