సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమం.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

జిల్లా అధ్యక్షులు వంగరి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహణ…

పోరు తెలంగాణ అక్టోబర్ 17: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జిల్లా కాగజ్నగర్ మండలం బట్టుపల్లి గ్రామంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ఆవిర్భావ దినోత్సవం మరియు ఆర్టీఐ వారోత్సవాలను జిల్లా అధ్యక్షులు వంగరి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీఐ ఆక్టివిస్టు, సమాచార హక్కు రక్షణ చట్టం 2005 తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్ హాజరై మాట్లాడుతూ జవాబుదారితనం, పారదర్శకత కోసమే సహ చట్టం ఉందన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాచారం పొందడం ప్రతి ఒక్కరి రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51(ఎ) ప్రకారం పౌరులకు గల ప్రాథమిక విధులు, బాధ్యతల నిర్వహణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ చట్టాల పైన, పథకాల పైన, రాజ్యాంగం పైన కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా మహిళలు మహిళా చట్టాలపై, ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యత, దరఖాస్తు విధానం గురించి తెలియజేశారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ (3) ప్రకారం దేశ పౌరులు అందరూ సమాచారం పొందే హక్కు కలదని, సెక్షన్ 6 (1) ప్రకారం సమాచారం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని, సెక్షన్ 4(4) ప్రకారం సమాచారాన్ని తెలుగులో పొందవచ్చు అని, సెక్షన్ 4(1) బి ప్రకారం స్వచ్ఛందంగా సమాచారం పొందవచ్చని, సెక్షన్ 2 జె(1) ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డ్ వెరిఫికేషన్ చేసుకోవచ్చని, సెక్షన్ 5(3) ప్రకారం దరఖాస్తు దారులకు ప్రజా సమాచార అధికారులు సహాయం అందించాలని, సెక్షన్ 19(1) ప్రకారం మొదటి అప్పీల్, 19(3) ప్రకారం రెండవ అప్పీల్ చేసి, చట్ట ప్రకారం నిర్ణీత సమయంలో సమాచారం పొందవచ్చని అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారితనం సాధ్యమవుతుందన్నారు. తమ సొసైటీ ఆధ్వర్యంలో నిరంతరము గ్రామ స్థాయి వరకు సహా చట్టం పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలను చైతన్య వంతం చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సహచట్టం పై గల సందేహాలను నివృత్తి చేస్తూ, దరఖాస్తు విధానాలను తెలుపుతూ సహకరిస్తూ, ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్యనా వారధిగా ఉంటూ సహా చట్టం పకడ్బందీగా అమలు కావడానికి ప్రభుత్వ అధికారులతో కలిసి తమ సొసైటీ కృషి చేస్తుందన్నారు. సైబర్ మోసాల పట్ల జాగ్రత్త సైబర్ మోసాలపై అవగాహన కలిగి ఉండాలని, వ్యక్తిగత సమాచారం ఎవరికి తెలుపవద్దని సూచించారు. లక్కీ లాటరీ, లోన్ మంజూరు, లోన్ యాప్స్, పండగ సందర్భంగా ఆఫర్లతో వచ్చే లింక్స్, ఏపీకే ఫైల్స్, రివార్డ్, క్యాష్ బ్యాక్ వంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ మోసాల విషయంలో ప్రభుత్వ అధికారుల, పోలీస్ అధికారుల, బ్యాంక్ అధికారుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. ఇలాంటి అనుమానం ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ కు లేదా సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజక వర్గ అధ్యక్షులు మాదాస్ నాగేష్ , కాగజ్ నగర్ మండల అధ్యక్షులు కడారి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ సంతోష్, తిరుపతి, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...

భీమారంలో బాల్క సుమన్ జన్మదిన వేడుకలు

భీమారం మండల కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, మాజీ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాల్కా సుమన్ ...

వరంగల్ లో సంచలన తీర్పు: భర్త హత్య కేసులో భార్యతో సహా 10 మందికి జీవిత ఖైదు

  వరంగల్,* తెలంగాణలో వైవాహిక వివాదాల నేపథ్యంలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి వరంగల్ జిల్లా కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. రంగంపేటకు చెందిన దత్తు...

పోలీసులమంటూ వ్యాపారి కిడ్నాప్.. రూ.15 కోట్ల డిమాండ్.. రూ.1.3 కోట్లు వసూలు

  హైదరాబాద్‌లో పోలీసులమంటూ ఓ 53 ఏళ్ల నగల వ్యాపారిని కిడ్నాప్ చేసిన ముఠా.. కుటుంబ సభ్యుల నుంచి రూ.15 కోట్లు డిమాండ్ చేసి, రూ.1.3...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.