గోదావరి బ్రిడ్జి వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జన బందోబస్తును పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 

గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి బ్రిడ్జి వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్‌తో కలిసి బుధవారం అర్ధరాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించి, బందోబస్తు విధులను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సమస్యలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించాలని సంబంధిత అధికారులకు సూచించారు. బందోబస్తు నిర్వహణలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

spot_img
spot_img

Related articles

155 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం: సీఎం రేవంత్

Oct 21, 2026, తెలంగాణ : సమాజం కోసం ప్రాణాలను అర్పించిన వారి స్మరించుకోవటం అందరి బాధ్యతని సీఎం రేవంత్ గుర్తు చేశారు. బుధవారం పోలీస్...

 వరంగల్ రామన్నపేట లో సాంస్కృతి, సంప్రదాయాలకు సన్మానం

సాంస్కృతి, సంప్రదాయాలకు సన్మానం రామన్నపేటలోని రాజీవ్ గాంధీ విగ్రహం ప్రాంతంలో కొమురవెల్లి విజయకుమార్ రామన్నపేట భక్త మండలి వారిచే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సాంస్కృతిక, సంప్రదాయాలలో...

కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో దసరా వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

దసరా పండుగ వేడుకల్లో భాగంగా కల్వకుర్తిలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. తన స్వగ్రామం...

దసరా వేళ స్వగ్రామానికి పొంగులేటి..నారాయణపురంలో పండుగ సందడి*_ _*పంచెకట్టులో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు.. గ్రామస్తులకు శుభాకాంక్షలు

  నారాయణపురం:: దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన నారాయణపురానికి చేరుకున్నారు. సోమవారం...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.