పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి, నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్ కార్యాలయంలో సెప్టెంబర్ నెల నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్, డివిజన్,జోన్ వారీగా పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. నిందితుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ,చార్జ్‌షీట్ దాఖలు తదితర అంశాల్లో కేసుల ప్రస్తుత స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ అధికారి స్టేషన్‌లో అందుబాటులో ఉంటూ నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని, చట్టప్రకారం నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సమర్థవంతంగా పనిచేసే అధికారులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలిపారు.

ప్రతి ఎస్‌హెచ్‌ఓ తన సిబ్బంది పనితీరు, ప్రవర్తన,కదలికలపై నిరంతరం పర్యవేక్షణ కలిగి ఉండాలని ఆదేశించారు.నేర సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నచిన్న విషయాలపై కూడా పోలీసులకు సమాచారం అందేలా సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.

ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట కేసులు నమోదు చేసి, సంఘటనా స్థలాన్ని సందర్శించి, వీడియో రికార్డింగ్, సాక్షుల విచారణ, సాక్ష్యాధారాల సేకరణ ద్వారా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని సూచించారు. సరైన చట్టపరమైన కారణం లేకుండా ఎవరినీ పోలీస్ స్టేషన్‌కు పిలవరాదని స్పష్టం చేశారు.నైట్ పెట్రోలింగ్‌ను మరింత పటిష్టం చేసి,అధికారులు, బ్లూ కోల్ట్స్,పెట్రోల్ కార్ సిబ్బంది అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎన్‌డీపీఎస్,నకిలీ విత్తనాల కేసుల్లో నిందితులపై చట్టప్రకారం పీడీ యాక్ట్ అమలుకు చర్యలు చేపట్టాలని, నేరాల ద్వారా సంపాదించిన ఆస్తుల స్వాధీనానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి అక్రమ సరఫరా, రవాణా, వినియోగంతో పాటు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, గుడుంబా తయారీ, అక్రమ ఇసుక రవాణా, పేకాట తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిఘా పెంచి, తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

చలికాలంలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని,వాహన తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

తీవ్రమైన నేరాలు, పోక్సో,ఎస్సీ,ఎస్టీ, మహిళలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు.ప్రాపర్టీ నేరాలు,చైన్ స్నాచింగ్, దొంగతనాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, నిందితులను త్వరగా పట్టుకునేందుకు సీసీఎస్, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మహిళలు,బాలల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని,లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తును నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని ఆదేశించారు.

డీజీపీ, సీసీసీ పిటిషన్లతో పాటు ఇతర పిటిషన్లను కూడా త్వరితగతిన విచారించాలని సూచించారు. ఫిర్యాదు వాస్తవమని తేలితే కేసు నమోదు చేయాలని,తప్పుడు ఫిర్యాదుల విషయంలో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

 

దుర్గామాత నవరాత్రి ఉత్సవాలపై ప్రత్యేక ఆదేశాలు

దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జన శోభాయాత్ర ముగిసే వరకు ఉత్సవ నిర్వాహకులు, కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని సూచించారు.

మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.ప్రతి మండప నిర్వాహకుడి వివరాలను పూర్తిగా సేకరించాలని,ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, కీలక ప్రదేశాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, పెద్దపల్లి డీసీపీ బి.రామ్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) 

కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ట్రాఫిక్ ఏసీపీ సి.హెచ్. శ్రీనివాస్,సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్‌రావు,సైబర్ క్రైమ్ ఏసీపీ రంగారెడ్డి,ఏఆర్ ఏసీపీ ప్రతాప్తో పాటు ఇతర సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు,ఎస్‌ఐలు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.