వరంగల్ రామన్నపేట లో సాంస్కృతి, సంప్రదాయాలకు సన్మానం

Date:

Share post:

📰 Generate e-Paper Clip

సాంస్కృతి, సంప్రదాయాలకు సన్మానం

రామన్నపేటలోని రాజీవ్ గాంధీ విగ్రహం ప్రాంతంలో కొమురవెల్లి విజయకుమార్ రామన్నపేట భక్త మండలి వారిచే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సాంస్కృతిక, సంప్రదాయాలలో భాగంగా విజయదశమి రోజున శమీ కొమ్మకు పూజలు చేసి ఉత్సవము అత్యంత వైభవంగా జరిగినది. ఇట్టి కార్యక్రమంలో డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని పూర్వకాలం వారు మనకు గొప్ప సంపదగా సాంస్కృతి, సంప్రదాయా లు వివిధ రకాల లో మనకు అందించడం జరిగినది. దానిని కాపాడుకోవడం మన బాధ్యత,ధర్మం. ఈ సందర్భంగా గత 30 సంవత్సరాలు నుండి స్వతహా నిబద్ధతతో వినాయక నవరాత్రులు అలాగే విజయదశమి రోజున షమీ కొమ్మను తీసుకువచ్చి బ్రాహ్మణులచే శాస్త్ర యుక్తంగా పూజలు నిర్వహిస్తూ హిందుత్వాన్ని పెంపొందించడంలో భాగంగా వారు చేస్తున్న కృషిని అభినందిస్తూ శాలువా, బొకేతో అత్యంత వైభవంగా సన్మానించడం జరిగినది. ఇటువంటి కార్యక్రమాలను తీసుకొని వివిధ ప్రాంతాల్లో ఇలాగే చేస్తూ హిందుత్వాన్ని పెంపొందిస్తూ, అలాగే సామూహిక స్నేహ బంధాలు, అనుబంధాలు పెరుగుతాయని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు వేద బ్రాహ్మణులచే నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కొమురవెల్లి విజయకుమార్ మాట్లాడుతూ పూజలు నిర్వహించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అన్నారు. నన్ను ట్రస్ట్ వారు సన్మానించడం నాలో ఇంకా ఎక్కువ ఉత్సవం పెరిగిందన్నారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు వినియోగం జరిగినది.

ఈ కార్యక్రమంలో ఈశ్వర్ అయ్యగారు,పడిశాల శ్రీధర్, స్వప్న, గొడిశాలబాలరాజు, నల్ల సత్యనారాయణ, మడూరి రమేష్, స్థానిక పుర ప్రముఖులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

155 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం: సీఎం రేవంత్

Oct 21, 2026, తెలంగాణ : సమాజం కోసం ప్రాణాలను అర్పించిన వారి స్మరించుకోవటం అందరి బాధ్యతని సీఎం రేవంత్ గుర్తు చేశారు. బుధవారం పోలీస్...

కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో దసరా వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

దసరా పండుగ వేడుకల్లో భాగంగా కల్వకుర్తిలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. తన స్వగ్రామం...

దసరా వేళ స్వగ్రామానికి పొంగులేటి..నారాయణపురంలో పండుగ సందడి*_ _*పంచెకట్టులో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు.. గ్రామస్తులకు శుభాకాంక్షలు

  నారాయణపురం:: దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన నారాయణపురానికి చేరుకున్నారు. సోమవారం...

చిట్యాల గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.

పోరు తెలంగాణ అక్టోబర్ 19: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలోని ఇట్యాల గ్రామంలో సద్దుల బతుకమ్మ...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.