కిసాన్ క్రాంతి మిషన్ రైతుల పత్తి చేలను పరిశీలించిన సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పోరు తెలంగాణ అక్టోబర్ 06: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.

 

ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడికి అవకాశం

పెంచికల్‌పేట్ మండలంలోని అగర్‌గూడ గ్రామ రైతులు కేంద్ర ప్రభుత్వ కపాస్ క్రాంతి మిషన్ ద్వారా పత్తి విత్తనాలు పొందారు. వారి పత్తి చేలను పరిశీలించేందుకు మంగళవారం సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు వ్యవసాయ అధికారులతో కలిసి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ, బొక్కి వాగు దాటి వెళ్లారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, అధిక సాంద్రతతో నాటిన పత్తి మొక్కలతో అధిక దిగుబడి సాధ్యమవుతుందని, ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పత్తి సాగులో దిగుబడి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్‌ను ప్రవేశపెట్టిందని, దీని ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలతో పాటు పిచికారీ మందులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారని వివరించారు. అనంతరం అగర్‌గూడ గ్రామపంచాయతీ భవనంలో రైతులకు బయో స్టిములెంట్ మందులు, దోమ నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేశారు.ఎమ్మెల్యేగా గత మూడేళ్లుగా రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, యూరియా, డీఏపీ సరఫరాను క్రమబద్ధీకరించామని హరీష్ బాబు తెలిపారు. వరి, పత్తి, మక్క రైతులకు పూర్తిస్థాయిలో మద్దతు ధర లభిస్తోందని, గతంలో మాదిరిగా అడ్డగోలు కటింగ్‌లు లేకుండా చేశామని చెప్పారు. గ్రామాలు, పట్టణాలు ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి వైపు సాగుతున్నాయని, అక్రమ కేసులు, భూకబ్జాలు లేకుండా చూశామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అగర్‌గూడ సర్పంచ్ అల్లూరి రాజేశ్వరి, జిల్లా వ్యవసాయ అధికారి డా. వెంకటి, ఏఓ రామకృష్ణ, వ్యవసాయ శాస్త్రవేత్త డా. మధు, తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

రేపు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

  Oct 19, 2026, తెలంగాణ : నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. దసరా వేడుకల కోసం సొంతూరికి వెళ్లనున్నారు....

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.