పోరు తెలంగాణ అక్టోబర్ 07:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం
పెద్దవాగు వంతెన సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దహెగాం నుంచి పెంచికల్పేట్ వైపు వస్తున్న బొలెరో వాహనం లో బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించి, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

