రైతులకు నిరంతర వ్యవసాయ విద్యుత్ సరఫరా పై ప్రత్యేక దృష్టి.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పోరు తెలంగాణ అక్టోబర్ 07:

వ్యవసాయానికి నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించేందుకు విఫలమైన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను ఎలాంటి జాప్యం లేకుండా మార్చి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించే చర్యలను టీజీఎన్‌పీడీసీఎల్ చేపడుతోందని జియం ఆపరేషన్-1 బాబురావు పేర్కొన్నారు. మంగళవారం సిర్పూర్ కాగజ్‌నగర్ రూరల్ సెక్షన్ పరిధిలోని గన్నారం డిస్ట్రిబ్యూషన్‌లో విఫలమైన 3-ఫేజ్ 25 కేవీఏ డీటీఆర్ స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసే పనులను జియం ఆపరేషన్ బాబురావు పర్యవేక్షించారు. విఫలమైన డీటీఆర్‌ను గుర్తించిన వెంటనే ప్రత్యామ్నాయ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి వ్యవసాయ విద్యుత్‌ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేలా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విఫలమైన ట్రాన్స్‌ఫార్మర్లను రోజువారీగా గుర్తించి, అవసరమైన చోట వెంటనే ప్రత్యామ్నాయ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని, మరమ్మతులకు గురైన ట్రాన్స్‌ఫార్మర్లను ఆలస్యం లేకుండా రిపేర్‌ చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు సూచించారు. రైతులకు నాణ్యమైన, విశ్వసనీయ విద్యుత్‌ సరఫరా అందించేందుకు విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించేలా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈ సిర్పూర్ కాగజ్‌నగర్ రూరల్, డీఈ ఎంఆర్‌టీ సిర్పూర్ కాగజ్‌నగర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

రేపు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

  Oct 19, 2026, తెలంగాణ : నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. దసరా వేడుకల కోసం సొంతూరికి వెళ్లనున్నారు....

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.