పోరు తెలంగాణ అక్టోబర్ 07:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.
ఆసిఫాబాద్ జిల్లా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ బేసిక్ కార్మికులకు మూడు, నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో వారు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని కార్మికులకు మద్దతు తెలిపారు.కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్న, సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి రెండు రోజుల్లోగా జీతాల సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్మికులకు సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే పోలీసు అధికారులతో మాట్లాడి, కాంట్రాక్టర్‌ను పిలిపించి కార్మికులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు.సమస్య పరిష్కారమయ్యే వరకు కార్మికులకు అండగా ఉంటానని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులతో మాట్లాడి కృషి చేస్తానని శ్యామ్ నాయక్ హామీ ఇచ్చారు.

