తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 

జగిత్యాల, అక్టోబర్ 10:

జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ, వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం ఎల్‌నినో పరిస్థితులు క్రమంగా బలపడే అవకాశం ఉన్నందున రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 శాతం లోటు వర్షపాతం నమోదవుతోందని, భవిష్యత్తులో ఈ లోటు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సాగునీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం కోటి 16 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయని మంత్రి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే వరి సాగు విస్తీర్ణం కేవలం 1.20 లక్షల ఎకరాలు మాత్రమే తగ్గిందన్నారు. ప్రత్యామ్నాయ పంటలను 33 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయామని పేర్కొన్నారు.

ఇంకా 49 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగడం ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళనకరమని, ఆగస్టు 7 తర్వాత కూడా మరో 10 లక్షల ఎకరాల్లో వరి సాగు విస్తరించిందని మంత్రి వివరించారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగులో తగిన మార్పులు చేసుకోవాలని మంత్రి సూచించారు. భూములను ఖాళీగా ఉంచకుండా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని కోరారు. నీటి వినియోగాన్ని తగ్గిస్తూ వ్యవసాయాన్ని కొనసాగించేలా రైతులకు అవగాహన కల్పించాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.

రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో పంటలు సాగు చేయాలని, నీటి లభ్యతకు అనుగుణంగా తక్కువ నీటి అవసరమున్న పంటలకు ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయం చేపట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  రైతులను కోరారు.

spot_img
spot_img

Related articles

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.