ఎల్ నీ నో ముందస్తు చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ . ఆరుతడి పంటలే మేలు జిల్లా కలెక్టర్ హరిత

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పోరు తెలంగాణ అక్టోబర్ 12: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.

ఆసిఫాబాద్ జిల్లాలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఖమ్మంలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి, హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర కార్యదర్శులతో కలిసి రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రైతులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు పాల్గొన్నారు.సాగునీరు, తాగునీరు, విద్యుత్ వినియోగం, పశుగ్రాసం అంశాలపై చర్చించారు. వీబీ–జీ రామ్ జీ పథకం కింద జలసిరి ద్వారా ఫాంపాండ్లు, ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, ఊట కుంటల నిర్మాణంపైనా సమీక్షించారు.

వాతావరణ మార్పుల వల్ల కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి, వ్యవసాయ రంగంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని, అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టుల్లో 50 శాతం నీరు కూడా చేరలేదని పేర్కొన్నారు

మంత్రి ఆదేశాలు

రైతులను ఆరుతడి పంటలు, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటల సాగుకు సిద్ధం చేయాలి. వ్యవసాయ, ఉద్యాన అధికారులు రైతులకు అవసరమైన సూచనలు ఇవ్వాలి; నీటి లభ్యతను బట్టి సమర్థంగా వినియోగించాలి. రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించి, తాగునీటి కొరత రాకుండా చూడాలి.పెరిగే విద్యుత్ డిమాండ్‌కు తగినట్లు సరఫరా వ్యవస్థను సిద్ధం చేయాలి.

పశువులకు తాగునీరు, దాణా అందుబాటులో ఉంచాలి; మత్స్య సంపదకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలి.గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను ముందే గుర్తించి పరిష్కరించాలి.

అన్ని శాఖలు క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తూ సమన్వయంతో పనిచేయాలని, ప్రభావాన్ని తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు స్పష్టం చేశారు.

జిల్లాలో కార్యక్రమం.

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్‌తో కలిసి కలెక్టర్ కె. హరిత పాల్గొన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని, తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకుని నీటి వనరులను సమర్థంగా వాడుకోవాలని సూచించారు. వీబీ–జీ రామ్ జీ పథకం ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆదర్శ రైతులు ప్రశాంత్, రాంమోహన్ ఆరుతడి పంటల వల్ల కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి బి. దత్తరావు, వ్యవసాయ అధికారి వెంకటి, ఉద్యాన శాఖ అధికారి నదీమ్ ఉద్దీన్, పశుసంవర్ధక, మత్స్య, నీటిపారుదల, విద్యుత్ శాఖల అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

దసరా వేళ స్వగ్రామానికి పొంగులేటి..నారాయణపురంలో పండుగ సందడి*_ _*పంచెకట్టులో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు.. గ్రామస్తులకు శుభాకాంక్షలు

  నారాయణపురం:: దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన నారాయణపురానికి చేరుకున్నారు. సోమవారం...

చిట్యాల గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.

పోరు తెలంగాణ అక్టోబర్ 19: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలోని ఇట్యాల గ్రామంలో సద్దుల బతుకమ్మ...

ఇట్యాల గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.

పోరు తెలంగాణ అక్టోబర్ 19: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలోని ఇట్యాల గ్రామంలో సద్దుల బతుకమ్మ...

రేపు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

  Oct 19, 2026, తెలంగాణ : నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. దసరా వేడుకల కోసం సొంతూరికి వెళ్లనున్నారు....
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.