రైతుల సాగునీటి సమస్యపై రాత్రివేళ స్పందించిన సబ్‌ కలెక్టర్‌కు రైతుల కృతజ్ఞతలు..

Date:

Share post:

📰 Generate e-Paper Clip

రేపటి నుంచే నీరు విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు – రైతుల్లో హర్షం….

పోరు తెలంగాణ అక్టోబర్ 16: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కాగజ్‌నగర్, సిర్పూర్ మండలాల పరిధిలో సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో, సాగునీరు విడుదల చేయాలని రైతులు చేపట్టిన పోరాటానికి అధికారులు స్పందించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల సమస్యను తెలుసుకున్న కాగజ్‌నగర్ సబ్‌ కలెక్టర్ రాత్రి వేళ అని కూడా చూడకుండా భామనగండి చెరువు వద్దకు, రైతుల పొలాల వద్దకు స్వయంగా వచ్చి పరిస్థితిని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, రైతుల పంటలను కాపాడేందుకు రేపే వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఇరిగేషన్ శాఖ డీఈ, జేఈ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వరి పంటకు చివరి రెండు తడులు అందితే పంట చేతికి వస్తుందని, ఈ సమయంలో నీరు అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకుని రాత్రి సమయంలోనూ క్షేత్రస్థాయికి వచ్చి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన సబ్‌ కలెక్టర్‌కు, స్పందించిన ఇరిగేషన్ శాఖ డీఈ, జేఈ అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్, రైతు సంఘం నాయకులు మాదారపు శ్రీనివాసరావు మాట్లాడుతూ, రైతుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పోరాటానికి అధికారులు సానుకూలంగా స్పందించడం అభినందనీయమన్నారు. రైతుల పంటలు ఎండిపోకుండా సకాలంలో నీరు అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. రైతుల కష్టాలను గుర్తించి క్షేత్రస్థాయికి వచ్చి స్పందించిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇచ్చిన హామీ మేరకు భామనగండి చెరువుకు వెంటనే నీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని వారు కోరారు.అధికారుల స్పందనతో రైతుల్లో ఆశలు చిగురించాయని, సాగునీరు అందితే తమ పంట చేతికి వస్తుందనే నమ్మకంతో రైతులు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు.

spot_img
spot_img

Related articles

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.