భీమారం శ్రీ నవదుర్గా భవాని ఉత్సవ సేవాసమితి ఆధ్వర్యంలో మహా చండీయాగం.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

భీమారం శ్రీ నవదుర్గా భవాని ఉత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గ మాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గా మండపం వద్ద మహా చండీ యాగాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య యాగ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి. తొలుత గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించి, అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహా చండీ యాగంలో భాగంగా వేద మంత్రాల పారాయణం, హోమ కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, గ్రామంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు నిర్వాహకులు తెలిపారు. యాగం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, వేద పండితులు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...

భీమారంలో బాల్క సుమన్ జన్మదిన వేడుకలు

భీమారం మండల కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, మాజీ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాల్కా సుమన్ ...

సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమం.

జిల్లా అధ్యక్షులు వంగరి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహణ... పోరు తెలంగాణ అక్టోబర్ 17: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.