మానవత్వం చాటుకున్న మంత్రి అడ్లూరి

Date:

Share post:

📰 Generate e-Paper Clip

జగిత్యాల// ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన, ఎండపల్లి మండల BRS పార్టీ అధ్యక్షులు సింహాచలం జగన్ ఇటీవల ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంతో, ఆయన కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.ఈ సందర్భంగా జగన్ కుటుంబ సభ్యులను ఓదార్చి, *వారి కుటుంబానికి రూ.50,000 ఆర్థిక సహాయం అందించారు*. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి తెలిపారు.కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తరఫున అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని,వారి పిల్లల చదువు విషయంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా కల్పించారు.ప్రతిపక్ష BRS పార్టీకి చెందిన నాయకుడి కుటుంబం అయినప్పటికీ, రాజకీయాలకు అతీతంగా మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పట్ల కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

spot_img
spot_img

Related articles

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ప్రారంభించినముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సముదాయం ఆవరణలో తెలంగాణ తల్లి...

సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన గ్రాండ్ సక్సెస్

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన లో నాయకులు, కార్యకర్తల ఉత్సాహం, ప్రజల అభిమానం మధ్య సాగిన ఈ పాదయాత్ర సిరిసిల్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది....

మంచిర్యాల పట్టణం అశోక్ రోడ్‌లో 29-09-2026న జరిగిన మోహన్ హత్య కేసుకు సంబంధించి మృతుడి భార్య జమున (39), ఆమె కుమార్తె అరెస్ట్

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల పట్టణం అశోక్ రోడ్‌లో 29-09-2026న జరిగిన మోహన్ హత్య కేసుకు సంబంధించి మృతుడి భార్య...

దళిత ఆదివాసి ఆత్మ గౌరవ సభ లో అజ్మీర శ్యామ్ నాయక్

సెప్టెంబర్ 30: న్యూఢిల్లీ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సభలో ఆసిఫాబాద్ నియోజకవర్గ...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.