మంచిర్యాల నియోజకవర్గం..
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వాసవి క్లబ్, యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొని భక్తులకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు మన పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయి..
అందుకే ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజిద్దాం. మట్టి వినాయకుడి ప్రతిష్టాపన అనేది కేవలం పూజా విధానం మాత్రమే కాదు.మన భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించే బాధ్యతాని చెప్పారు..
వాసవి క్లబ్, యూత్ క్లబ్ సభ్యులు చేపట్టిన ఈ పర్యావరణహిత కార్యక్రమం అభినందించి, భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మార్కెట్ కమిటీ చై

