గోయగంలో మిషన్ అమృత్ జల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం.కిడ్నీ సమస్యల నివారణకు శుద్ధి చేసిన తాగునీరు.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పోరు తెలంగాణ అక్టోబర్ 27: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కెరమెరి మండలం గోయగం గ్రామంలో మిషన్ అమృత్ జల్ పైలట్ ప్రాజెక్టును మంత్రి సీతక్క సోమవారం ప్రారంభించారు. జోడేఘాట్‌లో జరిగిన కొమురం భీమ్ వర్ధంతి కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న మార్గంలో ఆమె ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టు ఉద్దేశాన్ని జిల్లా కలెక్టర్ కె. హరిత మంత్రికి వివరించారు. గోయగం గ్రామంలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు వంటి సమస్యలు గుర్తించామని తెలిపారు. ఈ గ్రామంతో పాటు మరికొన్ని గ్రామాల ప్రజలు గత కొద్ది రోజులుగా మిషన్ భగీరథ నీటిని తాగడం లేదని, ఇలాంటి ఆరోగ్య సమస్యలను నివారించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని చెప్పారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ, మిషన్ భగీరథ నీటిని శుద్ధి చేసి గ్రామానికి అందించడం మంచి ఆలోచన అన్నారు. రసాయనాలతో కలుషితమైన నీటిని వాడకుండా, శుద్ధి చేసిన నీటినే తాగాలని గ్రామస్తులకు సూచించారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు.ఈ ప్రాజెక్టును విజయవంతం చేస్తే ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. దీన్ని అన్ని గ్రామాలకు విస్తరించే బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దితే కేంద్ర ప్రభుత్వం రూ. కోటి వరకు నిధులతో పాటు అవార్డులు కూడా అందించే అవకాశం ఉందని, ఆ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మట్, ఎస్పీ నితిక పంత్, కాంగ్రెస్ నాయకుడు శ్యాం నాయక్, ఎంసీ సుగుణక్క, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, గోయగం సర్పంచ్ ఆత్రం ఆనంద్ రావు, ఉప సర్పంచ్ మొహర్లే రాందాస్, పంచాయతీ కార్యదర్శి ఎం. మురళీధర్, నీతి ఆయోగ్ సమన్వయకర్త డాక్టర్ బాలరాజు, స్వయం సహాయక సంఘాల మహిళలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులు

భారత్ సమ్మిట్–2026లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు Rahul Gandhi కి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన...

తెలంగాణలో సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వమే ప్రభుత్వ అభివృద్ధి విధానం* *భారత్ సమ్మిట్ – 2026 అంతర్జాతీయ ప్యానెల్ చర్చలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్*

*హైదరాబాద్, నవంబర్ 13:* విద్య, సంక్షేమం, సాధికారత ద్వారానే సమాజంలో నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, దివ్యాంగులు, వయోవృద్ధులు,...

వయోజన విద్యాశాఖ జిల్లా ఇన్‌చార్జిగా ఏ. పురుషోత్తం బాధ్యతల స్వీకరణ

పోరు తెలంగాణ మంచిర్యాల జిల్లా,నవంబర్ 12, 2026: మంచిర్యాల జిల్లా వయోజన విద్యాశాఖ జిల్లా ఇన్‌చార్జిగా నూతనంగా నియమితులైన ఏ. పురుషోత్తం గురువారం బాధ్యతలు...

రెండేళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

Nov 13, 2026, రెండేళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం దేశంలో ఆహార ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి చేరింది. ఆర్బీఐ...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.