విద్యార్థుల సంక్షేమంపై రాజీ పడం..* *నాణ్యమైన విద్య పౌష్టిక ఆహారాన్ని అందించడం లక్ష్యం..* *రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి..* *చిన్న బోనాల ఎస్టీ గురుకుల పాఠశాలను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్..

Date:

Share post:

📰 Generate e-Paper Clip

*రాజన్న సిరిసిల్ల:*

రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు కల్పించే సౌకర్యాల విషయంలో ప్రజా ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చిన్న బోనాల లోని ఎస్టీ సంక్షేమ హాస్టల్ ను మంత్రి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు.

విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులతో పాటు కిచెన్ షెడ్, డైనింగ్ హాల్ తోపాటు హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల కు నాణ్యమైన విద్య పౌష్టిక ఆహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచడంతోపాటు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని మెనూ లో మార్పులు తీసుకువచ్చినట్లు మంత్రి వివరించారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. చిన్న బోనాల ఎస్టి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న బియ్యం నాణ్యతను పరిశీలించిన మంత్రి వాటిని వెనక్కి తీసుకొని నాణ్యమైన బియ్యం పంపించాలని అధికారులను అప్పటికప్పుడు ఆదేశించారు. అదేవిధంగా చిన్న బోనాల గురుకుల పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలకు అంచనాలు తయారు చేసి అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

spot_img
spot_img

Related articles

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు...

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా...

జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షునిగా కాసిపేట సతీష్ కుమార్

కాంగ్రెస్గ్  పార్టీ జైపూర్ మండల సెల్ అధ్యక్షునిగా జైపూర్ మండలం నర్సింగాపూర్ (ఎస్) గ్రామానికి చెందిన కాసిపేట సతీష్ ఎన్నికయ్యారు, ఈ సందర్భంగా కాసిపేట...

అటవీ ప్రాంతంలో అరుదైన నీలి రంగు పుట్టగొడుగు.

సిర్పూర్ (టీ) అక్టోబర్ 01: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌(టి) అటవీ డివిజన్‌ పరిధిలోని మాకిడి నెక్షన్‌, గొల్యాల్‌ అటవీ ప్రాంతంలో అరుదైన నీలిరంగు పుట్టగొడుగు...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.