కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కాళేశ్వరం జోన్‌-I డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా

Date:

Share post:

📰 Generate e-Paper Clip

కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం కాళేశ్వరం జోన్‌-I డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి,విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించారు.
అనంతరం ఎస్‌ఐ, స్టేషన్‌ రైటర్‌, సీసీటీఎన్‌ఎస్‌ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్‌ వివరాల నమోదు,రికార్డుల అప్‌లోడ్‌ ప్రక్రియపై ఆరా తీశారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తరచుగా నమోదయ్యే నేరాలు,గ్రామాల పరిస్థితి, శాంతిభద్రతల పరిస్థితి, స్టేషన్‌ నిర్వహణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితులు,ప్రజలకు అందిస్తున్న సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌షీట్లో ఉన్న వ్యక్తుల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, వారి కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.ప్రజల భద్రతకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించిన డీఐజీ, రాష్ట్ర సరిహద్దు పోలీస్‌స్టేషన్‌ కావడంతో సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

spot_img
spot_img

Related articles

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు...

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా...

జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షునిగా కాసిపేట సతీష్ కుమార్

కాంగ్రెస్గ్  పార్టీ జైపూర్ మండల సెల్ అధ్యక్షునిగా జైపూర్ మండలం నర్సింగాపూర్ (ఎస్) గ్రామానికి చెందిన కాసిపేట సతీష్ ఎన్నికయ్యారు, ఈ సందర్భంగా కాసిపేట...

అటవీ ప్రాంతంలో అరుదైన నీలి రంగు పుట్టగొడుగు.

సిర్పూర్ (టీ) అక్టోబర్ 01: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌(టి) అటవీ డివిజన్‌ పరిధిలోని మాకిడి నెక్షన్‌, గొల్యాల్‌ అటవీ ప్రాంతంలో అరుదైన నీలిరంగు పుట్టగొడుగు...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.