ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

Date:

Share post:

📰 Generate e-Paper Clip

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గంజాయి,పొగాకు ఉత్పత్తులు తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య,మానసిక, సామాజిక దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించారు.మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటికి ఆకర్షితులై తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.మత్తు పదార్థాల అక్రమ విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు విద్యపై,తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని పోలీసులు సూచించారు.
ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ జె.లక్ష్మణ్‌రావు, పెద్దపల్లి టౌన్ ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, రామగుండం నార్కోటిక్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

తెలంగాణలో ఆటో చార్జీల పెంపు

*🛺🛺తెలంగాణలో ఆటో చార్జీల పెంపు🛺🛺* 🔹ఆటోల కనీస చార్జీ ₹20 నుంచి ₹30కి పెంపు 🔹ప్రతి కిలోమీటర్‌కు ₹11 నుంచి ₹14కి పెంపు 🔹డిటెన్షన్ చార్జీ 50 పైసల...

తెలంగాణలో ఆటో చార్జీల పెంపు

*🛺🛺తెలంగాణలో ఆటో చార్జీల పెంపు🛺🛺* 🔹ఆటోల కనీస చార్జీ ₹20 నుంచి ₹30కి పెంపు 🔹ప్రతి కిలోమీటర్‌కు ₹11 నుంచి ₹14కి పెంపు 🔹డిటెన్షన్ చార్జీ 50 పైసల...

ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

* బూర్గంపాడు అక్టోబర్2 పోరు తెలంగాణ జిల్లా ప్రతినిధి కూరపాటి దాసు ...

ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు*

కొత్తగూడెం సెప్టెంబర్ 2 పోరు తెలంగాణ జిల్లా ప్రతినిధి కూరపాటి దాసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.