రహదారుల శుభ్రత,పాఠశాల వద్ద మొక్కలు నాటిన సర్పంచ్ బాపూజీ

Date:

Share post:

📰 Generate e-Paper Clip

వాంకిడి అక్టోబర్ 01:

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీ పరిధిలో పరిశుభ్రత, పచ్చదనం పెంపునకు సర్పంచ్ మొహార్లే బాపూజీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారులపై పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు.రహదారులపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని, నిర్ణీత ప్రదేశాల్లోనే వేయాలని ఆయన సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. రహదారులు, వీధులు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పారిశుధ్య సిబ్బందితో క్రమం తప్పకుండా శుభ్రత పనులు చేయిస్తున్నామని, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పచ్చదనం పెంపులో భాగంగా గ్రామంలోని పాఠశాల సమీపంలో మొక్కలు నాటారు. విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ఇవి దోహదపడతాయని సర్పంచ్ తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, క్రమం తప్పకుండా నీరు పోయాలని సూచించారు. మొక్కల సంరక్షణలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా భాగస్వాములు కావాలని కోరారు. గ్రామంలోని ప్రతి ఖాళీ స్థలంలో వీలైనన్ని మొక్కలు నాటాలని గ్రామపంచాయతీ నిర్ణయించినట్లు చెప్పారు.గ్రామాభివృద్ధిలో రహదారుల పరిశుభ్రత, పారిశుధ్యం, పచ్చదనానికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రజల సహకారంతో సరండిని పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని సర్పంచ్ మొహార్లే బాపూజీ పేర్కొన్నారు.

spot_img
spot_img

Related articles

కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం*జింకలగూడెంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం*జింకలగూడెంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ డాగ్ స్క్వాడ్‌తో ఇంటింటా తనిఖీలు.. అప్రమత్తమైన జిల్లా పోలీసులు...

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన – బ్రాహ్మణపల్లిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌, IPS .

అక్టోబర్‌ 4వ తేదీన బ్రాహ్మణపల్లిలో జరగనున్న అమూల్‌ మిల్క్‌ బల్క్‌ యూనిట్‌ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ VVIP...

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

జగిత్యాలలో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం వెలుగులోకి“ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసం చేసినట్లు ఫిర్యాదు

జగిత్యాల// అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులు సేకరించిన కేసులో ఓ వ్యక్తిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. “ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.