హిమాచల్ ప్రదేశ్ లోని మౌంట్ తరంగ్ 2 పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన గురుకుల విద్యార్థి 6,027 మీటర్ల ఎత్తైన మౌంట్‌ అవలీలగా అధిరోహించిన ఇస్లావత్‌ బన్నీ తొలి భారతీయ బృందంలో చోటు.. విద్యార్థిని అభినందించిన సంక్షేమ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

Date:

Share post:

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌, అక్టోబరు 3:

సంకల్పం.. క్రమశిక్షణ.. పట్టుదల ఉంటే ఎంతటి ఎత్తయిన లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని తెలంగాణ గిరిజన గురుకుల విద్యార్థి ఇస్లావత్‌ బన్నీ నిరూపించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని 6,027 మీటర్ల (19,774 అడుగుల) ఎత్తైన మౌంట్‌ తరంగ్‌-2 శిఖరాన్ని అధిరోహించి చారిత్రక ఘనత సాధించారు. తెలంగాణ
గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (TGTWRDC), కామారెడ్డిలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్న బన్నీ ఈ నెల 22న అధిరోహించారు.
సెప్టెంబరు 30న తిరిగి తిరిగి సురక్షితంగా వచ్చారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో శనివారం సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ..బన్నీని శాలువాతో సత్కరించి అభినందించారు. విద్యార్థి సాధించిన ఘనతను మంత్రి ప్రశంసించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “బన్నీ సాధించిన విజయం ఒక్క విద్యార్థి విజయమే కాదు.. తెలంగాణలోని ప్రతి గురుకుల విద్యార్థికి స్ఫూర్తినిచ్చే ఘనత. చదువుతో పాటు క్రీడలు, సాహస క్రీడలు, ఇతర రంగాల్లోనూ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోవాలి. లక్ష్యం ఎంత ఎత్తులో ఉన్నా దాన్ని చేరుకోవాలనే పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధన ఉంటే విజయాన్ని సాధించవచ్చు” అని అన్నారు.

“ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడమే నిజమైన క్రీడాస్ఫూర్తి. గెలుపు మాత్రమే కాదు.. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వాన్ని కూడా క్రీడలు, సాహస కార్యక్రమాలు పెంపొందిస్తాయి. బన్నీ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది గురుకుల విద్యార్థులు క్రీడలు, సాహస రంగాల్లో ముందుకు రావాలి” అని మంత్రి ఆకాంక్షించారు.

spot_img
spot_img

Related articles

ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మరియు సహచర మంత్రులతో కలిసి ప్రత్యేక ప్రయాణం

హైదరాబాద్// హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా, సమగ్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్‌ను ప్రజలకు చేరువ...

ప్రజావాణి కార్యక్రమం రద్దు

మంచిర్యాల// జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అక్టోబర్ 3, 2026: నిర్మల్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సమావేశానికి...

ప్రజావాణి కార్యక్రమం రద్దు

మంచిర్యాల// జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అక్టోబర్ 3, 2026: నిర్మల్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సమావేశానికి...

డీఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్

భద్రాద్రి కొత్తగూడెం, (పోరు తెలంగాణ-పినపాక నియోజకవర్గ ప్రతినిధి-వల్లెపోగు రాము) భూర్గంపహాడ్ అక్టోబర్ 2 :- తెల్లవారుజామున బూర్గంపహాడ్ మండలం జింకల గూడెం గ్రామంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.