
కోటపల్లి మండలం లోని మల్లంపేట గ్రామ పంచాయతీ లో బాలల దినోత్సవ వేడుకలను విద్యార్థులు ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా సర్పంచ్ తాళ్ల వెంకటమ్మ -బాపు మాట్లాడుతూ పిల్లలతో ప్రతి ఒక్కరు మంచిగా చదువుకోవాలని పిల్లలే దేశ భవిష్యత్తు అని విద్యార్థులు క్రమశిక్షణ మంచి నడవడిక పట్టు దలతో చదువు కొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఆటపాటలలో నైపుణ్యత ఉండాలని ఎంతో ఎత్తుకు ఎదగాలని గ్రామంలో బాల్యవివాహలను జరగకుండా చూసుకోవాలని తెలిపారు.పిల్లల విద్య కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయాలను తీసుకుంటూ మంచి కార్యక్రమాలు చేపడుతుంది అని అదేవిదంగా ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్లకి వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని సర్పంచ్
తాళ్లవేంకటమ్మ కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ శ్రీ విద్య మరియ పాఠశాల ఇంచార్జి సంతోష్ మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సతీష్ మరియు అంగన్వాడీ టీచర్లు గూడెపు పద్మ, ఎన్నం రానబాయ్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.

