ఎం.ఎల్.ఎస్. పాయింట్ల వద్ద నిల్వల పంపిణీని సకాలంలో పూర్తి చేయాలి

Date:

Share post:

📰 Generate e-Paper Clip

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

మంచిర్యాల,సెప్టెంబర్ 10, 2026:

జిల్లాలోని అన్ని ఎం.ఎల్.ఎస్. పాయింట్ల వద్ద నిలువల పంపిణీ సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, ఎ.సి.ఎస్.ఓ. తో కలిసి ఇన్‌చార్జీలు, డి.ఈ.ఓ.లు, స్టేజ్–1, స్టేజ్–2 గుత్తేదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎం.ఎల్.ఎస్. పాయింట్ల వద్ద ఉన్న నిల్వల పంపిణీ ప్రక్రియను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత ఇన్‌చార్జీలను ఆదేశించారు. స్టాక్ తరలింపులో ఎలాంటి జాప్యం లేకుండా సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు. స్టేజ్–1, స్టేజ్–2 గుత్తేదారులు అవసరానికి అనుగుణంగా తగినన్ని వాహనాలను ముందస్తుగా ఏర్పాటు చేసుకుని, అందుబాటులో ఉన్న నిల్వలను సకాలంలో తరలించాలని ఆదేశించారు. నిల్వల తరలింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

జగిత్యాలలో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం వెలుగులోకి“ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసం చేసినట్లు ఫిర్యాదు

జగిత్యాల// అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులు సేకరించిన కేసులో ఓ వ్యక్తిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. “ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు...

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు...

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.