ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీపీ అంబర్ కిషోర్ ఝా

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి//,రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని,ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరూ తాము ప్రారంభించిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యేలా చూడాలని,ప్రజల కష్టాలను తొలగించి వారి జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో ప్రజల మధ్య నెలకొన్న సోదరభావం,ఐక్యత ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు.పోలీస్ శాఖ సూచనల మేరకు ఆయా వినాయక మండపాల నిర్వాహకులు, యువత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్సవాలను నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఇదే స్ఫూర్తితో నేటి నుంచి నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సీపీ ప్రజలకు సూచించారు.
ఈ పూజా కార్యక్రమంలో అదనపు డీసీపీ పరిపాలన కె.శ్రీనివాస్,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఆర్‌ఐలు మల్లేశం, శేఖర్, రమేష్,ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు,పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నవీన్, ఉపాధ్యక్షుడు తిరుపతి,సంఘం సభ్యులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

లక్షెట్టిపేట లో ఆవోప ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

పోరు తెలంగాణ లక్షెట్టిపేట అక్టోబర్ 2. లక్షెట్టిపేట పట్టణంలో ఆవోప ఆధ్వర్యంలో గాంధీ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి...

లక్షెట్టిపేట లో అవోప ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

లక్షెట్టిపేట పట్టణంలో ఆవోప ఆధ్వర్యంలో గాంధీ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు....

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఒప్పందం చేసుకున్న జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు హరేకృష్ణ...

హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నీ జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్...

పోలీసు అధికారులు, సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 క్లస్టర్

హైదరాబాద్// పోలీసు అధికారులు, సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక దృఢత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.