పెండింగ్ వేతనాలు,రూ.1.40 కోట్ల పిఎఫ్ బకాయిలు చెల్లించాలని సిఐటియు డిమాండ్. బతుకమ్మ ఆడి నిరసన తెలిపిన మునిసిపల్ కార్మికులు.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పోరు తెలంగాణ అక్టోబర్ 16: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.కాగజ్‌నగర్ మండలం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ – సీఐటీయూ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్ పట్టణ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు సీఐటీయూ పోరాట పాటలు పాడుతూ, కార్మిక బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు.కార్మికులు బతుకమ్మ ఆడుతున్న సమయంలో మున్సిపల్ కమిషనర్ విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆటకు ఆటంకం కలిగించారని యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జె. రాజేందర్ మాట్లాడుతూ, కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, బకాయి ఉన్న రూ.1.40 కోట్ల పీఎఫ్ మొత్తాన్ని తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేశారు. పండుగ పూట కూడా వేతనాలు ఇవ్వకుండా కార్మిక కుటుంబాలను పస్తులుంచడం సబబేనా అని ప్రశ్నించారు. పట్టణ ప్రజలకు నిరంతరం సేవలందించే కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న కార్మికుల బతుకమ్మ ఆటకు విద్యుత్ నిలిపివేయడం సరైన చర్య కాదని విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించి వేతనాలు, పీఎఫ్ బకాయిలతో పాటు ఇతర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.

spot_img
spot_img

Related articles

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...

భీమారంలో బాల్క సుమన్ జన్మదిన వేడుకలు

భీమారం మండల కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, మాజీ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాల్కా సుమన్ ...

సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమం.

జిల్లా అధ్యక్షులు వంగరి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహణ... పోరు తెలంగాణ అక్టోబర్ 17: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.