మహిళలు,బాలికల భద్రతలో షీ టీమ్స్ కీలక పాత్ర పోషించాలి- సీపీ అంబర్ కిషొర్ ఝా  ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలి

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 

పెద్దపల్లి//రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధ్యక్షతన గురువారం కమిషనరేట్ కార్యాలయంలో షీ టీమ్స్, మహిళలు, పిల్లల భరోసా కేంద్రాల సేవలపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మహిళలు, బాలికలకు భద్రతపై భరోసా కల్పించడంతో పాటు పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించడంలో షీ టీమ్స్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ, మహిళలను వేధించే ఆకతాయిలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. అందిన ఫిర్యాదులపై ఆధారాలను సేకరించి, అవసరమైన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ముఖ్యంగా 12 నుంచి 18 ఏళ్ల బాలికలకు వేధింపులు,సైబర్ నేరాలు,సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, మంచి స్పర్శ–చెడు స్పర్శ వంటి అంశాలపై పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

బాధిత మహిళలు, చిన్నారులకు తక్షణ సహాయం అందించడంతో పాటు కౌన్సెలింగ్, వైద్య, న్యాయ, పునరావాస, సంక్షేమ సేవలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. బాధితుల పట్ల సానుభూతి, మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ వారికి ధైర్యం,భరోసా కల్పించాలన్నారు.

బాధితుల ఫిర్యాదులపై కేసుల నమోదు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని, ఫిర్యాదులో నేరం ఉన్నట్లు తేలితే ముందుగా కేసు నమోదు చేసి అనంతరం దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. బాధితుల పట్ల అలసత్వం ప్రదర్శించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు, బాధితులకు నాణ్యమైన కౌన్సెలింగ్, రక్షణ, పునరావాస సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

షీ టీమ్స్ సిబ్బంది నిజాయితీ, పారదర్శకత, నిష్పక్షపాతంగా వృత్తిపరమైన విధులు నిర్వహిస్తూ బాధితుల గోప్యతను కాపాడాలని కమిషనర్ సూచించారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా పోలీసులను ఆశ్రయించేలా అవగాహన కల్పించాలని, వారి భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ అనిల్,మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ,షీ టీమ్ ఎస్‌ఐలు హైమా,ఉషారాణి, లావణ్య,షీ టీమ్ సిబ్బంది,భరోసా కేంద్రం సభ్యులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.