ఎస్సి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు. జాడి దిలీప్ కుమార్ డిమాండ్.
కొమరంభీమ్ ఆసిఫాబాద్. అక్టోబర్. 04 : ఆసిఫాబాద్ లుంబిని దీక్ష భూమిలో ఆదివారం నిర్వహించిన 59 ఎస్సీ కులాల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎస్సి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జాడి దిలీప్ కుమార్ డిమాండ్, ఎస్సీల హక్కుల సాధన కోసం.జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు 20 శాతానికి పెంచాలని,ఎస్సి కార్పొరేషన్ నిధులు ఎస్సి లకే వినియోగించాలనిఅన్య అన్నారు. అంబే
ద్కర్ అభయ హస్తం కింద అర్హులైన ఎస్సి లకు ఒక్కొక్కరికి లక్ష ఇరవై వెలు స్వయంఉపాధి కోసం మంజూరు చేయాలని అన్నారు. అనంతరం మాట్లాడిన సమత సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం సందీప్ మాట్లడుతూ ప్రతి గ్రామం లో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామం అంబేద్కర్ భవనం నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ గ్రామాలలో “ఆదివాసుల తో SC లకు సమానం హక్కులు కల్పించాలని,పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ,విద్యా, వైద్యం, న్యాయం ఉచితంగా ఇవ్వాలని, భూమి లేని నిరుపేద SC లకు 3 ఎకరాలు ఇవ్వాలని భారతీయ బౌద్ధ మహా సభ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అశోక్ మహుల్కర్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రశాంత్,నాయకులు పెరుగు ఆత్మారాం, చల్లూరి వామన్, దుర్గ అనిల్, చాపిడి సురేష్, మహిళ నాయకులు ,యువకులు పాల్గొన్నారు.
.

