ప్రజల గొంతుకగా ప్రెస్ క్లబ్, మూడో ఏడాదిలోకి అడుగు.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

భీమారం మండల ప్రెస్ క్లబ్ రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రభుత్వాల దృష్టికి ప్రజా సమస్యలను తీసుకెళ్లడంతో పాటు, ప్రజల గొంతుకగా నిలిచి సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేయాలని ప్రెస్ క్లబ్ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడం, ప్రజలకు న్యాయం జరిగేలా వార్తా కథనాల ద్వారా కృషి చేయడం ప్రెస్ క్లబ్ ప్రధాన లక్ష్యమని సభ్యులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకోగా అధ్యక్షుడిగా కాసిపేట రవి, గౌరవ అధ్యక్షుడిగా సాయిని శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా నాంపల్లి చంద్రశేఖర్, జనరల్ సెక్రటరీగా నూతి నాగరాజు, కోశాధికారిగా నరేష్, కార్యవర్గ సభ్యుడిగా గజానంద్ ఎన్నికయ్యారు.
రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, ప్రభుత్వాలు మరియు సంబంధిత అధికారుల దృష్టికి ప్రజల ఇబ్బందులను తీసుకెళ్లేందుకు ప్రెస్ క్లబ్ కృషి చేయాలని నూతన కమిటీ నిర్ణయించింది. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా, నిష్పక్షపాత వార్తా సేకరణతో ప్రజల పక్షాన నిలుస్తామని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.

spot_img
spot_img

Related articles

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...

భీమారంలో బాల్క సుమన్ జన్మదిన వేడుకలు

భీమారం మండల కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, మాజీ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాల్కా సుమన్ ...

సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమం.

జిల్లా అధ్యక్షులు వంగరి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహణ... పోరు తెలంగాణ అక్టోబర్ 17: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.