పెండింగ్ వేతనాలు,రూ.1.40 కోట్ల పిఎఫ్ బకాయిలు చెల్లించాలని సిఐటియు డిమాండ్. బతుకమ్మ ఆడి నిరసన తెలిపిన మునిసిపల్ కార్మికులు.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పోరు తెలంగాణ అక్టోబర్ 16: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.కాగజ్‌నగర్ మండలం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ – సీఐటీయూ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్ పట్టణ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు సీఐటీయూ పోరాట పాటలు పాడుతూ, కార్మిక బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు.కార్మికులు బతుకమ్మ ఆడుతున్న సమయంలో మున్సిపల్ కమిషనర్ విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆటకు ఆటంకం కలిగించారని యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జె. రాజేందర్ మాట్లాడుతూ, కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, బకాయి ఉన్న రూ.1.40 కోట్ల పీఎఫ్ మొత్తాన్ని తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేశారు. పండుగ పూట కూడా వేతనాలు ఇవ్వకుండా కార్మిక కుటుంబాలను పస్తులుంచడం సబబేనా అని ప్రశ్నించారు. పట్టణ ప్రజలకు నిరంతరం సేవలందించే కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న కార్మికుల బతుకమ్మ ఆటకు విద్యుత్ నిలిపివేయడం సరైన చర్య కాదని విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించి వేతనాలు, పీఎఫ్ బకాయిలతో పాటు ఇతర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.

spot_img
spot_img

Related articles

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.