బాల్కొండ జెడ్ పి హెచ్ ఎస్ లో ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం తనిఖీ.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, విద్యార్థుల అభ్యసన స్థాయిలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యానల్ ఇన్‌స్పెక్షన్ బృందం బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించి సమగ్రంగా తనిఖీ నిర్వహించింది.నోడల్ అధికారి కే. శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన ఈ తనిఖీలో ఉపాధ్యాయుల బోధనా విధానం,సిలబస్ పూర్తి చేసిన తీరు, విద్యార్థుల అభ్యసన స్థాయిలు తదితర అంశాలను బృందం పరిశీలించింది. అలాగే పాఠశాలలోని మౌలిక వసతులు,మధ్యాహ్న భోజన నాణ్యత, పాఠశాల పారిశుధ్యం, కిచెన్ గార్డెన్, ఖాన్ అకాడమీ ద్వారా డిజిటల్ బోధన, టీ.ఎల్.ఎం.ల వినియోగం, క్రీడల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించడంతో పాటు సంబంధిత పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు.విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన స్థాయిలను అంచనా వేసిన ప్యానల్ బృందం, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలు చేసింది.విద్యార్థులలో అభ్యసన ఫలితాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని సూచించింది.ఈ తనిఖీ బృందంలో గంట అశోక్, తెడ్డు చిన్నయ్య,పి. గంగా మోహన్,గంగాధర్,ఆర్. గంగాధర్,కె.రమేష్,డి.విశ్వనాథ్, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్. గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్, సీనియర్ ఉపాధ్యాయులు ఎం. ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

గణేష్ ఉత్సవ నిర్వాహకులతో సమీక్ష సమావేశం

మెండోర మండల కేంద్రంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని మండల ఎస్సై సుహాసిని తెలిపారు. మండల కేంద్రంలోని గణేష్ ఉత్సవ నిర్వాహకులతో, యువజన సంఘాల...

గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం.

 మంచిర్యాల గోదావరి నది తీరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ సూర్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు పిలుపునిచ్చారు, శుక్రవారం...

మహిళ సంఘం భవనాలకు స్థలం పరిశీలన

మహిళ సంఘం భవనాలకు స్థలం పరిశీలన... కామారెడ్డి జిల్లా ప్రతి నిధి:సెప్టెంబర్ 4(పోరు తెలంగాణ న్యూస్:) ప్రభుత్వం మహిళల అభివృద్ధి, అభ్యున్నతి కోసం వ్యవసాయ గోదాంలు మరియు...

విద్యా పరిపాలనలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు విశిష్ట ప్రతిభా పురస్కారం 

విద్యా పరిపాలనలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు విశిష్ట ప్రతిభా పురస్కారం  సెప్టెంబర్ 4, 2026: విద్యా పరిపాలనలో విశిష్ట ప్రతిభా పురస్కారం–2026”కు...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.