అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజీపల్లి గ్రామ శివారులో ఎస్సై ఎ . రాజేందర్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ప్రభుత్వ సంబంధిత శాఖల నుండి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను గుర్తించి పట్టుకున్నారు.

విచారణలో సదరు ట్రాక్టర్ బూరుగుపల్లి గ్రామానికి చెందినదిగా గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవర్/యజమాని భూక్యా చంద్రశేఖర్ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు తేలడంతో, అతనిపై సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు భీమారం ఎస్సై ఎ . రాజేందర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, ఇసుక, మట్టి తదితర ఖనిజాలను రవాణా చేసే వారు సంబంధిత అధికారుల నుండి అవసరమైన అన్ని అనుమతులు పొందిన తరువాతనే రవాణా చేయాలని సూచించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక లేదా మట్టి రవాణా చేస్తే, అటువంటి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామనిlll హెచ్చరించారు.

spot_img
spot_img

Related articles

గణేష్ ఉత్సవ నిర్వాహకులతో సమీక్ష సమావేశం

మెండోర మండల కేంద్రంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని మండల ఎస్సై సుహాసిని తెలిపారు. మండల కేంద్రంలోని గణేష్ ఉత్సవ నిర్వాహకులతో, యువజన సంఘాల...

గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం.

 మంచిర్యాల గోదావరి నది తీరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ సూర్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు పిలుపునిచ్చారు, శుక్రవారం...

మహిళ సంఘం భవనాలకు స్థలం పరిశీలన

మహిళ సంఘం భవనాలకు స్థలం పరిశీలన... కామారెడ్డి జిల్లా ప్రతి నిధి:సెప్టెంబర్ 4(పోరు తెలంగాణ న్యూస్:) ప్రభుత్వం మహిళల అభివృద్ధి, అభ్యున్నతి కోసం వ్యవసాయ గోదాంలు మరియు...

విద్యా పరిపాలనలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు విశిష్ట ప్రతిభా పురస్కారం 

విద్యా పరిపాలనలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు విశిష్ట ప్రతిభా పురస్కారం  సెప్టెంబర్ 4, 2026: విద్యా పరిపాలనలో విశిష్ట ప్రతిభా పురస్కారం–2026”కు...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.