వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమార్చన.
లక్షెట్టిపేట పోరు తెలంగాణ , సెప్టెంబర్ 4:
లక్షెట్టిపేట పట్టణంలోని బీట్ బజార్ లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం మహిళలు సామూహికంగా కుంకుమార్చన చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మహిళలు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

