జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియామకం అయిన కంతి మోహన్ రెడ్డి ని శుక్రవారం మెట్ పల్లి న్యాయవాదులు శాలువా, పూలమాల తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రాంరెడ్డి మాట్లాడుతూ, మాతోటి న్యాయవాది టిజెయాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకం కావడం మాకెంతో గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని అకాంక్షించారు. ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు మెడిచెల్మల సుమలత, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, న్యాయవాదులు గండ్ర ప్రవీణ్ రావు, యండి వల్లియొద్దీన్, గడ్డం శంకర్ రెడ్డి, బద్దం లక్ష్మారెడ్డి, పోలకొండ దయాకర్ వర్మ, నాంపల్లి మరుతి, పసునూరి సుదర్శన్, మామిడిపల్లి విజయలక్ష్మి, నేరెళ్ల శ్రీధర్, తెడ్డు ఆనంద్, పసునూరి శ్రీనివాస్, నీరటి రమణ, కోల అశోక్, చింతకుంట శంకర్, టిజెయాస్ నాయకులు చిలువెరీ నంద గోపాల్, ఏశాల గంగారెడ్డి, గజ్జి రాజేందర్, కంతి రమేష్ లు పాల్గొన్నారు
టీ జె ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకమైన కంతి మోహన్ రెడ్డిని సన్మానించిన న్యాయవాదులు….
Date:
Share post:

