ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు*

Date:

Share post:

📰 Generate e-Paper Clip

కొత్తగూడెం సెప్టెంబర్ 2 పోరు తెలంగాణ జిల్లా ప్రతినిధి కూరపాటి దాసు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది సైతం గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గాంధీజీ సత్యం, అహింసా మార్గాలు దేశ ప్రజలకు ఆదర్శం అని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, కరుణాకర్, ఆర్‌ఐలు సుధాకర్, రవి, లాల్ బాబు, కృష్ణారావు, ట్రాఫిక్ ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

ఏసీబీ సంచలనం! రూ 2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సర్పంచ్! డిమాండ్ చేసింది రూ 30 లక్షలు!

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం మోదుగడ్డ తండా గ్రామ సర్పంచ్ ధరావత్ వీరు అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో చిక్కారు! ఖమ్మంలో...

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇకపై అలాంటి పోస్టులకు చెక్‌.. మెటా కీలక నిర్ణయం!*

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా కీలక అప్డేట్ తీసుకొచ్చింది. అశ్లీలత, హింసాత్మక, రెచ్చగొట్టే స్వభావం ఉన్న కంటెంట్‌ను నియంత్రించేందుకు రికమెండేషన్ అల్గారిథమ్‌లో మార్పులు చేసింది. ఇకపై యూజర్లు...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.