కాగజ్‌నగర్ మున్సిపల్ టెండర్లపై విచారణ జరపాలి…. రూ.18.70 కోట్ల యూఐడీఎఫ్ పనుల్లో అక్రమాలంటూ సీపీఎం వినతి….

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 

పోరు తెలంగాణ అక్టోబర్ 24: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.

కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో యూఐడీఎఫ్ నిధులు రూ.18.70 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల టెండర్లలో అక్రమాలు జరిగాయని, వీటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ముంజం ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.గుత్తేదారులు కూటమిగా ఏర్పడి టెండర్లు దాఖలు చేశారని, పర్సంటేజీల రూపంలో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై పత్రికల్లోనూ కథనాలు వచ్చాయని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ విచారణ చేపట్టడం మంచి పరిణామమే అయినా, కేవలం దస్తావేజులు పరిశీలించి నివేదిక ఇవ్వడంతో ఈ వ్యవహారం ముగియకూడదన్నారు.వినతిపత్రంలో పేర్కొన్న ప్రధాన డిమాండ్లు అన్ని పనుల టెండర్ నోటిఫికేషన్లు, బిడ్డింగ్ వివరాలు, అంచనా వ్యయాలు, వర్క్ ఆర్డర్లను పరిశీలించాలి కాంట్రాక్టర్ల కుమ్మక్కు, ముందస్తు ఒప్పందాలు, పర్సంటేజీల పంపకాలపై ఆధారాలతో విచారణ జరపాలి విచారణ పూర్తయ్యేవరకు సంబంధిత పనుల తదుపరి చర్యలను నిలిపివేయాలి అక్రమాలు తేలితే టెండర్లు రద్దుచేసి, పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలి బాధ్యులైన కాంట్రాక్టర్లను అనర్హులుగా ప్రకటించాలి, అధికారులపై శాఖాపరమైన, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఇప్పటికే ప్రారంభమైన, పూర్తయిన పనుల నాణ్యత, వ్యయాన్ని స్వతంత్రంగా తనిఖీ చేయాలి విచారణ నివేదికను ప్రజలకు వెల్లడించాలి ప్రజాధనాన్ని దోచుకునే ప్రయత్నాలకు అవకాశం ఇవ్వకూడదని, రాజకీయ పలుకుబడి లేదా కాంట్రాక్టర్ల ప్రభావంతో ఎవరూ తప్పించుకోకూడదని వారు స్పష్టం చేశారు. ఆరోపణల్లో నిజానిజాలను నిష్పక్షపాత విచారణ ద్వారా తేల్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాదారపు శ్రీనివాసరావు, బొర్కుట్ రాజేందర్, కోట శ్రీనివాస్ పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

మల్లంపేట గ్రామపంచాయతీలో ఘనంగా బాలల దినోత్సవం

కోటపల్లి మండలం లోని మల్లంపేట గ్రామ పంచాయతీ లో బాలల దినోత్సవ వేడుకలను విద్యార్థులు ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా సర్పంచ్ తాళ్ల...

టీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యుడిగా మంతెన సమ్మయ్య.

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యుజె—ఐ జెయు) జిల్లా కార్యవర్గ సభ్యు డిగా భీమారం మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, మంతెన సమ్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంచిర్యాలలో నిర్వహించిన టియుడబ్ల్యుజె–ఐజెయు...

వేలాల ప్రభుత్వ పాఠశాలలో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు

జైపూర్ మండలం వేలాల గ్రామపంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలలో ముందస్తుగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తేదీ.13.11.2026 శుక్రవారం రోజున పాఠశాల ప్రధానోపాధ్యాయులు  కె.శారద  ఆధ్వర్యంలో చిన్నారుల...

రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులు

భారత్ సమ్మిట్–2026లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు Rahul Gandhi కి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.